ఏజెన్సీ ప్రాంతమైన వెనుకబడిన గాదిగూడ మండలంలో నీటి సమస్యలు పెరుగుతున్నాయి. పర్సవాడ, రూపపూర్, భొజ్జు గ్రామాల్లో ప్రజలు గత 3 నెలల నుండి మంచి నీటి లేక ఇక్కట్లు పడుతున్నట్లు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి కోట్నక్ సక్కు అన్నారు. అధికారులను పలుమార్లు విన్నవించినా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.