ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట బుధవారం కార్మికులు నిరసన చేపట్టారు. డిమాండ్స్ డే సందర్భంగా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు ఆర్టీసీ డిపో ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మిట్టపెల్లి భీమ్ రావ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సవరించిన కార్మిక చట్టాలను రద్దు చేయాలని, ఈ చట్టాల అమలుతో కార్మికుల హక్కులు హరించిపొతాయన్నారు.