గాదిగూడ బీజేపీ మండల అధ్యక్షుడిగా మడావి యశ్వంత్ రావును ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. దీంతో బుధవారం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు ధోని శ్రీశైలం ఆయన పేరును ఖరారు చేశారు. అదేవిధంగా పార్టీ జిల్లా కౌన్సిల్ మెంబర్ గా మడావి నటరాజ్ పేరును ప్రకటించారు. పార్టీ అధ్యక్షతన జరిగే అన్ని కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగించి బీజేపీ బలోపేతానికి కృషి చేయాలనీ శ్రీశైలం కోరారు.