అత్యవసర సమయంలో యువకుల రక్తదానం

62చూసినవారు
అత్యవసర సమయంలో యువకుల రక్తదానం
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చించుగాట్ గ్రామానికి చెందిన చంద్రబాన్ అనారోగ్యంతో రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు బాధితునికి అత్యవసరంగా రక్తం అవసరమని చెప్పగానే కుటుంబ సభ్యులు ప్రగతిశీల యువజన సంఘం నాయకులను సంప్రదించారు. ఈ విషయమై యువకులు బాధితునికి శుక్రవారం రక్తదానం చేసి ఉదారతను చాటారు. కార్యక్రమంలో రహటే గజానంద్, సాయికుమార్, అశోక్, రాము, రాజు, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్