ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న పులిని అటవీ అధికారులు పట్టుకున్నారు. సిర్పూర్ (టి) మాకిడి అటవీ ప్రాంతానికి 7 కి.మీ దూరంలోని మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా ఆత్మారాంగుడా సమీపంలో అక్కడి ఫారెస్ట్ అధికారులు బుధవారం రాత్రి పట్టుకున్నట్లు సమాచారం. కాగా గతేడాది నవంబర్ 29న కాగజ్‌నగర్ గన్నారంలోని ఓ పొలంలో పనులు చేస్తున్న లక్ష్మిపై పులి దాడి చేసింది. కాగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.