వాంకిడి పోలీస్ స్టేషన్ పరిధిలోని బంబారా గ్రామ శివారులో సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఖేడేగాం గ్రామానికి చెందిన ఆత్రం సోనేరావు, మరో ద్విచక్రవాహనంపై మడావి దౌలత్ రావు, మడావి జామున, జంగుబైతో కలసి గణేష్ పూర్ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్సై పోశెట్టి తెలిపారు.