ఆసిఫాబాద్: మందపై పులి దాడి.. తప్పించుకున్న ఆవులు

3292చూసినవారు
ఆసిఫాబాద్: మందపై పులి దాడి.. తప్పించుకున్న ఆవులు
తిర్యాణి మండలంలోని ఎదలపాడు శీవారు అటవీ ప్రాంతంలో ఎదులపాడు గ్రామానికి చెందిన పశువుల కాపరులు పశువులను మేత కోసం శనివారం అటవీ ప్రాంతానికి వెళ్లారు. పెద్దపులి పశువుల మందపై ఒక్కసారిగా దాడి చేసిందని అది చూసిన పశువులు కాపరులు కేకలు వేయడంతో పెద్దపులి పారిపోయిందని పశువుల కాపరులు తెలిపారు. ఎదులపాడు, ఎగిండి అటవీ ప్రాంతంలో ఒంటరిగా ఎవరు వెళ్లద్దని కాపరులు సూచించారు.

సంబంధిత పోస్ట్