వాంకిడి మండలం ఇందాని ఎక్స్ రోడ్ జిన్నింగ్ మిల్లులో గురువారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మిల్లులోకి పత్తి లోడుతో వచ్చిన వాహనానికి ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని వాహనంలోని పత్తితో పాటు మిల్లులోని పత్తి దగ్ధమైంది. గమనించిన కార్మికులు వెంటనే పత్తి కాలుతున్న వాహనాన్ని మిల్లు నుంచి దూరంగా పంపించారు. మిల్లులో కాలిపోతున్న పత్తిని ఆర్పేందుకు ప్రయత్నించారు.