కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని గొల్లగూడ గ్రామానికి చెందిన మౌనిక వరకట్నం వేధింపులు తాళలేక బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఆసిఫాబాద్ సీఐ రవీందర్ వివరాల ప్రకారం గత కొన్ని రోజులుగా భర్త, అత్తామామ అదనపు వరకట్నం తీసుకురావాలని మౌనికను వేధింపులకు గురి చేస్తున్నారు. తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.