పదహారు వందలకు మీకు ఫోన్ అంటూ ఈ అపరిచిత నంబర్ (7092856345) నుంచి గత రోజు క్రితం వాంకిడి మండలానికి చెందిన ఓ యువకుడికి కాల్ వచ్చింది. మీ జియో నంబర్కి ఆఫర్ వచ్చిందని, రూ. 1, 600కి మొబైల్ ఫోన్ పక్క వందశాతం అని నమ్మించి మోసం చేశారన్నారు. పోస్ట్లో వచ్చిన పార్సల్ బాక్స్ ని విప్పగా మోస పోయానన్నారు. ఫోన్ అని ఫేక్ పార్సల్ చేసి 1,600 దోచేశారన్నాడు. డబ్బు తిరిగి రాదని పోస్టు అధికారులు మంగళవారం చెప్పగా మోసపూరిత కాల్స్ పట్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరాడు.