ఎలుగుబంటి దాడి... మేకల కాపరికి తీవ్రగాయాలు

55చూసినవారు
హాజీపూర్ మండలంలోని గుడిపేట గ్రామానికి చెందిన పశువుల కాపరి జగన్నాథుల నాగరాజును ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. మేకలను ముల్కల ర్యాలీ వాగు సమీపంలోని అటవీ ప్రాంతంలో మేయిస్తుండగా పిల్లలతో ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా నాగరాజు ముఖంపై దాడి చేసింది. తీవ్ర గాయాలయి అపస్మారక స్థితిలో ఉన్న నాగరాజును ముల్కల గ్రామానికి చెందిన కొందరు రైతులు గమనించి కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్