బెల్లంపల్లి: గురిజాల రైతు వేదికలో చోరీ

801చూసినవారు
బెల్లంపల్లి: గురిజాల రైతు వేదికలో చోరీ
బెల్లంపల్లి మండలంలోని గురిజాల రైతు వేదికలో చోరీ జరిగినట్లు బెల్లంపల్లి రూరల్ సిఐ అఫ్జలుద్దీన్, తాళ్ల గురజాల ఎస్సై రమేష్ శనివారం తెలిపారు. ఉదయం వెళ్లి చూడగా తలుపులు పగలగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా వీడియో కాన్ఫరెన్స్ యూనిట్, సౌండ్ బాక్సులు చోరీకి గురైనట్లు గుర్తించారు. చోరీకి గురైన సామాగ్రి విలువ సుమారు 3 లక్షల వరకు ఉంటుందని వ్యవసాయ అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్