బెల్లంపల్లి: చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

80చూసినవారు
బెల్లంపల్లి: చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బెల్లంపల్లి బస్తీకి చెందిన ఆయుల్ల పోసు (60) బుధవారం బెల్లంపల్లి పోచమ్మ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు వన్ టౌన్ సిఐ దేవయ్య తెలిపారు. పోసు మూడు నెలల క్రితం పక్షవాతానికి గురైంది. పోసుకు ఆసుపత్రిలో చికిత్స చేయించిన నయం కాకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. మృతురాలి భర్త పోషం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్