రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ బెల్లంపల్లి సబ్ డివిజన్ తాండూర్ సర్కిల్ పరిధిలోని మాదారం, తాండూర్, భీమిని, కన్నెపల్లి పోలీస్ స్టేషన్ లను కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్ల పరిసరాలను పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పోలీస్ స్టేషన్ సిసిసి పిటిషన్ లను, వాటి రికార్డ్ లను తనిఖీ చేసి, బాధితుల ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించాలన్నారు.