జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

72చూసినవారు
జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల జాతీయ రహదారి హనుమాన్ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఆ వ్యక్తికి తలకు తీవ్ర గాయం అయింది. స్థానికులు గమనించి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్