ఓదెల మండలానికి చెందిన మల్లేష్ గౌడ్ (36) తాండూరు మండలం కాసిపేట గ్రామంలో గీతా కార్మిక పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బైక్ పై వస్తున్న మల్లేష్ ను బోయపల్లి బోర్డు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఆదివారం ఆయన మృతి చెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.