తాండూర్: భార్య మందలించిందని భర్త ఆత్మహత్య

82చూసినవారు
తాండూర్: భార్య మందలించిందని భర్త ఆత్మహత్య
తాండూరు మండలం నగరం గ్రామానికి చెందిన రావుల సాంబయ్య(60) అనే వ్యక్తి భార్య మందలించిందని గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. ప్రతిరోజు మద్యం సేవించి ఇంట్లో గొడవ పడుతూ ఉండే వాడు. భార్య మందలించడంతో మనస్థాపనకి గురై తన పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతుని కొడుకు సంపత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్