జొన్న లాప తిని 9 పశువులు మృతి

7198చూసినవారు
జొన్న లాప తిని 9 పశువులు మృతి
జొన్న మొదళ్లకు చిగురించిన విషపూరితమైన లాపలను తిని మంగళవారం తొమ్మిది పశువుల మృత్యువాత పడ్డాయి. తాంసి మండలం అట్నాంగూడ, భీంపూర్ మండలం కైరిగూడ, రేణిగూడకు చెందిన రైతుల పశువులు ఉదయం ఓరైతు జొన్న చేనులోని లాపలను తిని తొమ్మిది పశువులు మృత్యువాత పడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పశువైద్యాధికారి శ్రీకాంత్ చికిత్స అందించడంతో మరో 12 పశువులు ప్రాణాలతో బయటపడ్డాయి.

సంబంధిత పోస్ట్