ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో లోని నీలా నగర్ కాలనీలో కరెంట్ తీగలు చేతికందే విధంగా ఉన్నాయి. అధికారులు కనీస దృష్టి సారించి వాటిని బాగు చేయాలని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ఎదురుగాలులకు విద్యుత్ తీగలు ఎక్కడ పడిపోతాయో అని భయం కాలనీ వాసుల్లో నెలకొంది. అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించాలని కోరుతున్నారు.