ఆదిలాబాద్: గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

66చూసినవారు
ఆదిలాబాద్: గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో ఎండు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. మండలంలోని అర్లి టీ గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించగా, ఆ గ్రామానికి చెందిన భణ కొండ అశోక్ వద్ద 4 కిలోల సగం ఎండు గంజాయి పట్టు బడింది. ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్, ఎచ్ సీ సుధామ్, తనజీ, కానిస్టేబుళ్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్