ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ నెల 13న రాత్రి ఓ బాలుడు ఏడుస్తూ కనిపించగా రైల్వే పోలీసులు చైల్డ్ లైన్ వారికీ సమాచారం అందించారు. బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్, షూర్ ఎన్జీవో కోఆర్డినేటర్ వినోద్ రైల్వే పోలీసులతో కలిసి శనివారం బాలూడిని చేరాదిశారు. రైల్వే స్టేషన్ లోని సిసీ ఫుటేజ్ పరిశీలించగా అతడి తల్లి ఎక్కడ వదిలివెళ్లిన్నట్లు గుర్తించారు. బాలుడు పేరు గణేష్, తల్లిదండ్రులు రాంరాజు, పూజా అని తెలిపారు.