సమగ్ర శిక్షలోని 18 విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, విద్యాశాఖలో విలీనం చేసి పే స్కేల్ అమలు చేయాలని గత 21 రోజులుగా ఉద్యోగులు వివిధ రకాలుగా సమ్మె నిర్వహిస్తున్నారు. శనివారం ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయానికి వందలాదిగా తరలివచ్చిన ఉద్యోగులు క్యాంపు ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు.