మారుమూల గ్రామాలకు బైక్ పై వెళ్లిన ఆదిలాబాద్ ఎస్పి

85చూసినవారు
చదువు వల్ల ఆదివాసీలకు అభివృద్ధి సాధ్యం అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. భీంపూర్ మండలంలోని మారుమూల గ్రామాలను మంగళవారం ద్విచక్ర వాహనంపై ఎస్పి వెళ్లారు. మండలంలోని గుబిడి, టెకిడి రాంపూర్, కరంజీ, భగవాన్పూర్ లలో పోలీసు మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఆదివాసీలు గంజాయి కి దూరంగా ఉండాలని సూచించారు. త్వరలోనే ఆదిలాబాద్ లో జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. అనంతరం యువతకు స్పోర్ట్స్ కిట్ లను ఎస్పీ అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్