ఆదిలాబాద్: స్నేహితుడి హత్య కేసులో ముగ్గురికి రిమాండ్

77చూసినవారు
ఆదిలాబాద్: స్నేహితుడి హత్య కేసులో ముగ్గురికి రిమాండ్
బజార్హత్నూర్ మండలం దేగామ గ్రామంలో స్నేహితుల మధ్య ఘర్షణలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. సీఐ వెంకటేశ్వరరావు కథనం ప్రకారం. అరుణ్ తన స్నేహితులైన చందు, రాము, వినోద్ తో కలిసి ఆదివారం మద్యం తాగుతుండగా అరుణ్ వారిని దొంగతనాలకు పాల్పడుతున్నారని అనడంతో తాగిన మైఖంలో వారి మధ్యలో ఘర్షణ జరిగింది. అయితే ఆ విషయంలో ముగ్గురు స్నేహితులు అరుణ్ పై సోమవారం దాడి చేయగా ఈ దాడిలో అరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి మంగళవారం ముగ్గురిని రిమాండ్ కి తరలించారు.

సంబంధిత పోస్ట్