ఆదిలాబాద్ సర్కార్ బడిలో చదువు చెబుతున్నా.. తమ బిడ్డలను ప్రైవేట్ స్కూల్స్ లో చేరుస్తున్న రోజులువీ.. కానీ ఈ టీచర్లు తాము బోధించే బడుల్లోనే పిల్లలను చేర్పించి ఆదర్శనంగా నిలిచారు. తలమడుగు మండలం బరంపూర్ జెడ్పిహెచ్ఎస్ ఉపాధ్యాయుడు అమరేందర్ తన కుమార్తే అక్షరను 6వ తరగతి, ఎంపీపీఎస్ ఎస్జీటీ సత్యనారాయణ తన కుమార్తె యుక్తను 2వ తరగతిలో, తంసి మండలం కప్పర్ల ఎంపీపీస్ ఎస్జీటీ గంబీర్ తన కుమారుడు కృష్ణను 2వ, కుమార్తె ప్రజ్ఞశ్రీని 4వ తరగతిలో చేర్పించారు.