తలమడుగులో గురువారం అమ్మ మాట. అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ముందుగా పిల్లలతో సెల్ఫీలు దిగారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీలో పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలు, బోధన గురించి వివరించారు. తల్లిదండ్రులు చిన్నపిల్లలను అంగన్వాడీలకు తప్పకుండా పంపించాలని సూచించారు. 5 సంవత్సరాలు నిండిన వారిని ప్రైమరీ స్కూల్‌లో చేర్పించాలని పేర్కొన్నారు.