బజారత్నూర్ ఎస్ఐగా అప్పారావు

79చూసినవారు
బజారత్నూర్ ఎస్ఐగా అప్పారావు
నిజామాబాద్ కమిషనరేట్ నుంచి బజారత్నూర్ ఎస్ఐగా బదిలీ అయిన అప్పారావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ జీవన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో కలిసి పూల మొక్కను అందజేశారు. అప్పారావు గతంలో ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసు స్టేషన్లో ఎస్ఐగా పని చేశారు. ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ కమిషనరేట్ కు బదిలీపై వెళ్లారు. ఇటీవల బదిలీలో భాగంగా మళ్ళీ జిల్లాకు వచ్చారు.

సంబంధిత పోస్ట్