బజార్‌హత్నూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. శుక్రవారం ఇచ్చోడ నుంచి బజార్‌హత్నూర్ కి ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో గిన్నూర్ గ్రామ సమీపంలో రాగానే అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయలయ్యాయి. అయితే ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.