సిరికొండ మండలంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలని ఇన్‌చార్జ్ తహశీల్దార్ ఉపేందర్ తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 17వ తేదీలోగా సమర్పించాలన్నారు. 18 ఏళ్ల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాలు లోపు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకట్ రావు, యువకులు ఉన్నారు.