ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన లభిస్తున్నదని ధన్నూర్ బి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం రావుల శంకర్ తెలిపారు. మండలంలోని ధన్నూర్ బి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలకు వచ్చిన విద్యార్థులను మండల విద్యాధికారి మహమ్మద్ హుస్సేన్, ఉపాధ్యాయులతో కలిసి ఆహ్వానించి చిన్నారులకు అక్షర శ్రీకారం చేయించారు.