ఇటుక బట్టీలలో వలస కుటుంబాల బడీడు పిల్లల వివరాలను నమోదు చేసుకుంటున్నామని డీసీపీయుూ కౌన్సిలర్ పద్మ, షూర్ ఎన్జీవో డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ కె. వినోద్ అన్నారు. బాలకార్మికుల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం తాంసీ, తలమడుగు మండలాల్లోని ఇటుక బట్టీల్లో తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు బడీడు పిల్లలను గుర్తించి స్థానిక పాఠశాలలో చేర్పిస్తామన్నారు. బాల కార్మిక నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు.