బోథ్: పోడు రైతులను అటవీ అధికారులు ఇబ్బందులు పెట్టవద్దు

1చూసినవారు
ఇచ్చొడ మండలంలోని కేశవ్ పట్నం, బాబ్జి పెట్ పోడు రైతులను అటవీ అధికారులు ఇబ్బందులు పెట్టడం మానుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ అన్నారు. శనివారం బాబ్జి పెట్ వద్ద ఎమ్మెల్యే స్వయంగా రైతులతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోడు రైతులను ఇబ్బందులు పెడితే సహించబోమని, అవసరమైతే రైతుల కోసం ఎంతకైనా తెగిస్తామన్నారు. వెంటనే రైతులను ఇబ్బందులు పెట్టడం మానేసి వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్