ఆంధ్రప్రదేశ్ లో కుట్రపూరితంగా జరుగుతున్న జర్నలిస్టుల అరెస్ట్ లను ప్రభుత్వం వెంటనే ఆపాలని బోథ్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ సూది నరేష్ డిమాండ్ చేశారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావుని ఏపీ ప్రభుత్వం అక్రమ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. దీన్ని పత్రికా స్వేచ్ఛపై దాడిగా భావిస్తున్నామని తెలిపారు. రాజకీయ కక్షలను జర్నలిస్టుల మీద రుద్ది ఇబ్బందులకు గురిచేయడం సరైనది కాదన్నారు.