బోథ్: వైద్యుల సలహా మేరకే మందులను వాడాలి

67చూసినవారు
వైద్యుల సలహా మేరకే టాబ్లెట్లను వాడాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మూఢనమ్మకాలను, నాటు వైద్యాన్ని నమ్మవద్దని సూచించారు. బోథ్ మండలం పట్నాపూర్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ శిబిరంలో వివిధ గ్రామాల నుండి సుమారు 250 మంది వరకు వైద్య పరీక్షలు చేసుకున్నారు. గంజాయి, సైబర్ క్రైమ్, డయల్ 100, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. త్వరలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్