అటవి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని నిర్మల్ కార్యాలయంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖలో పెండింగ్‌లో ఉన్న 13 దేవాలయాలను త్వరగా మంజూరు చేయాలని కోరారు. మంత్రి తక్షణమే స్పందించి, ఎండోన్మెంట్ కమిషనర్‌కు తెలియజేసి, త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.