నేరడిగొండ మండలంలోని వడూరు ( వైడూర్య పురం) గ్రామంలో నిర్వహించిన వైడూర్య పురం కబ్బడి పోటీలను ముఖ్య అతిథిగా పాల్గొని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం సాయంత్రం ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం క్రీడాకారులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడారు. క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడానికి పోటీలు ఎంతో గాను దోహదం చేస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మాజీ ఎంపీపీ రాథోడ్ సజాన్, తదితరులున్నారు