బోథ్ మండలంలోని పొచ్చర గ్రామంలో శనివారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించారు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్ల పనులను వెంటనే పూర్తి చేయించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించి చరవాణిలో అధికారులతో మాట్లాడి తక్షణమే ఆరోగ్య ఉప కేంద్రములో పెండింగులో ఉన్న మరుగుదొడ్ల పనులను పూర్తి చేసి ఉపయోగంలోకి తేవాలని అదేశించారు. డీఈఈ స్పందించారు.