ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రం పరిధిలోని మహాలక్ష్మి తల్లి ఆలయం వద్ద ఆదివాసీ గిరిజనులు ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని గుబ్బ, గోదుమల్లె లక్కపూర్ ఆయా గ్రామాల ఆదివాసులు వేసవిలో ఎలాంటి వ్యాధులు రాకుండా అక్కడే వంటలు చేసుకుని భోజనాలు చేశారు. ఈ మాసంలో పూజలు చేస్తూ ఆనవాయితీగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్నామని గ్రామల పటేల్, గ్రామ పెద్దలు తెలిపారు.