బోథ్: నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: డీఈఓ

7చూసినవారు
బోథ్: నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: డీఈఓ
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందించడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని డీఈఓ ఏనుగు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇచ్చోడ మండలం కామగిరి ప్రభుత్వ పాఠశాలకు నిమ్మల సుధాకర్ రెడ్డి, నక్కల సంతోష్ రెడ్డి విరాళంగా అందజేసిన బ్యాగులు, పెన్నులను డీఈఓ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడేలా ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేస్తుందన్నారు. ఏంఈఓ బిక్కు సింగ్, హెచ్ఎం శ్రీధర్, గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్