నేరడిగొండ మండలంలోని వడూర్ అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు నిర్వహించిన వనదర్శిని కార్యక్రమంలో ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అటవీ అధికారులు కలిసి హరితవనంలో మొక్కలు నాటారు. గ్రాస్ ల్యాండ్ లో పిటి (నీటి కుంట) ను కాలినడకన అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు. సఫారీలో తిరుగుతూ సోలార్ బోర్ వెల్ తో పాటు మొత్తం అటవీ ప్రాంతాన్ని సందర్శించారు.