నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శనివారం తలమడుగు మండలంలోని కోసాయిలో కొనసాగుతున్న కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా కబడ్డీ ఆడి పోటీలను ప్రారంభించారు. ఎమ్మెల్యే కబడ్డి ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. యువత క్రీడల్లో సైతం రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.