హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే

60చూసినవారు
హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే
హనుమాన్ జయంతి సందర్భంగా నెరడిగొండ మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. ఇందులో భాగంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ సైతం ఆలయాన్ని పార్టీ నాయకులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వీరి వెంట మాజీ ఎంపీపీలు రాథోడ్ సజన్, ప్రీతం రెడ్డి, వీడీసీ చైర్మన్ రవీందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి, గులాబ్, పండరీ, సాబ్లే సంతోష్, రాథోడ్ సురేందర్, కరణ్, విజయ్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్