బోథ్: వ్యక్తి మృతికి కారణమైన నిందితుడికి రిమాండ్

67చూసినవారు
బోథ్: వ్యక్తి మృతికి కారణమైన నిందితుడికి రిమాండ్
బోథ్ మండలంలోని పిప్పలదారి గ్రామానికి చెందిన బండారి చంద్రశేఖర్ ను అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్ కు తరలించినట్లు సిఐ వెంకటేశ్వర్ రావు తెలిపారు. మూడు రోజుల క్రితం నిందితుడు తన శనగ పంట చుట్టూ కరెంట్ వైర్ అమర్చడంతో అతడి దగ్గర పని చేస్తున్న పాలేరు మెస్రం కృష్ణ విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు

సంబంధిత పోస్ట్