నిజామాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చర గ్రామానికి చెందిన లక్ష్మణ్ (32) అనే యువకుడు, తాను చేసిన దొంగతనం వల్ల గ్రామస్తుల మధ్య పరువు పోయిందని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీనితో జీవితంపై విరక్తి చెంది సోమవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.