
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలు
AP: రాష్ట్రంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహించేందుకు భారీగా పెంచిన రాయితీలకు నిన్న మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 35%గా ఉన్న పెట్టుబడి రాయితీని 45%కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉత్పత్తి కార్యకలాపాలకు ఈ పెట్టుబడి రాయితీని ఇస్తుండగా.. ఇకపై రవాణా, లాజిస్టిక్స్‌కు సైతం 45% రాయితీ ఇవ్వనున్నారు. అలాగే రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్మెంట్ ప్రోత్సాహాన్ని ఐదేళ్లపాటు ఇస్తారు.