రైతులకు నష్టపరహారం చెల్లించాలి

73చూసినవారు
తలమడుగు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం తహశీల్దార్ రాజ్ మోహన్‌కు మండల రైతులు వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షలకు మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో పంటలు దెబ్బతిన్నాయని రెవిన్యూ, వ్యవసాయ అధికారులు పంటను పరిశీలించి కోతకు గురైన రైతులకు రూ. 20 వేలు, పంట నష్టపోయిన రూ. 15 వేలు నష్టపరిహారం రైతులకు ఇప్పించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్