బీజేపీ జాతీయ మండలి సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు ఏనుగు రాకేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కట్కామ్ రాందాస్, సిడం రాకేష్, పెద్ద లాస్మన్న, పోచన్న, అశోక్, వెంకట్ రెడ్డి, సంతోష్, సాయి పాల్గొన్నారు.