ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదం తెలపడం పట్ల గురువారం ఇచ్చోడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నియోజకవర్గ ఇన్చార్జ్ కొత్తూరు లక్ష్మణ్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, సీతక్క, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం ఫ్లెక్సీ లకు పాలాభిషేకం చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.