భీంపూర్ మండలం మహారాష్ట్రకు సరిహద్దుగా పెన్ గంగ నదిని ఆనుకొని పలు గ్రామాల్లో శనివారం దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని అర్లి(టి), అంతర్గాం, గోముత్రి, కరంజి(టి), గుబిడి గ్రామాలలో పండుగ జరుపుకున్నారు. అర్లి(టి) గ్రామంలో గ్రామ రైతులు, పశుపోషకులు గోవుల మందకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం గ్రామంలోని బాలాజీ మందిర్ వద్ద పశువులకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు