రుణమాఫీ అమలు కాని రైతులు అధైర్యపడవద్దని, ప్రతి క్లస్టర్ పరిధిలో వ్యవసాయ అధికారులు పూర్తి వివరాలు నమోదు చేస్తున్నారని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం తలమడుగు మండలంలోని పల్సి కే గ్రామా శివారులోని ఆయిల్ పాం నర్సరీని పరిశీలించి యాజమాన్యం నుండి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సుంకిడిలోని రైతు వేదికలో రుణమాఫీ అమలు కాని లబ్దిదారుల వివరాలను నమోదు చేస్తున్న ప్రక్రియను పర్యవేక్షించారు.